గ్రహణమున్నా.. మధ్యాహ్నం 12లోపు రాఖీ కట్టొచ్చు
సోమవారం(ఆగస్ట్ 7) రాత్రికి ప్రపంచ వ్యాప్తంగా పాక్షిక చంద్రగ్రహణం జరగనుంది. దీంతో రేపు ఉదయం నుంచే ఆలయాలను మూసివేయనున్నరు. మళ్లీ ఎల్లుండి(ఆగస్ట్ 8) ఉదయం సంప్రోక్షణ తర్వాత ఓపెన్ చేస్తారు. అటు గ్రహణ ప్రభావం ఉండటంతో….మధ్యాహ్నం 12గంటల లోపు రాఖీ కట్టింకోవచ్చంటున్నరు పండితులు.
రేపు పాక్షికంగా చంద్రగ్రహణం ఏర్పడనుంది. రేపు రాత్రి 10 గంటల 52 నిమిషాలకు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం….అర్ధరాత్రి 12 గంటల 48 నిమిషాల వరకు కొనసాగనుంది. అయితే ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్ తో పాటు ఆఫ్రికాలోని చాలా చోట్ల చంద్రగ్రహణం కనపడనుంది. మరోవైపు రేపు రాఖీ పండగ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత గ్రహణ ప్రభావం ఉండటంతో….ఆ లోపు రాఖీ కట్టింకోవచ్చంటున్నరు పండితులు.
చంద్రగహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నరు. మళ్లీ ఎల్లుండి ఉదయం సంప్రోక్షణ తర్వాత ఓపెన్ చేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు టీటీడీ ఈవో శ్రీనివాసరాజు. తిరుమలతో పాటు యాదాద్రి, వేములవాడ, శ్రీశైలం ఆలయాలను కూడా మూసివేస్తారు.
మరోవైపు రేపు రాఖీ పండగ సందర్భంగా ఇప్పటికే పలువురికి రాఖీలు కట్టారు విద్యార్థులు. అమర్ నాథ్ యాత్ర సెక్యూరిటీ సిబ్బందికి రాఖీ కట్టిన స్కూల్ విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.













