ముందుకు రాని అవిశ్వాసం…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. టీడీపీ, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. అటు రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలంటూ తెలుగుదేశం సభ్యులు, కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు చైర్మన్ వెల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.













