లోక్ సభ నిరవధిక వాయిదా
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపాక లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మరో 12 రోజులు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా.. కోవిడ్ భయాందోళనల కారణంగా ముందే లోక్ సభను వాయిదా వేశారు.లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్ విజ•ంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది. దీంతో లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం దాదాపు దేశమంతటా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక బిల్లు అనేది ద్రవ్య బిల్లు కావడంతో లోక్ సభ ఆమోదం తెలిపాక రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత… రాజ్యసభను కూడా వాయిదా వేశారు.













