ఆగస్టు 31 డెడ్‌లైన్
ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇందుకు ఆగస్టు 31 డెడ్‌లైన్ విధించింది. ఈ లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే పాన్ కార్డు రద్దు అవుతుందని హెచ్చరించింది. ఆగస్టు 31 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని ఆర్థిక మంత్రిత్వ వాఖ సృష్టం చేసింది. ఆగస్టు 31 లోపు ఆధార్ నెంబర్‌తో లింక్ చేయని ఐటి రిటర్న్స్ కూడా చెల్లవని సృష్టం చేసింది. 2017 ఎవరైతే పాన్ కార్డ్ కలిగి ఉంటారో వారంతా సెక్షన్ 139 ఏఏ, సబ్ సెక్షన్ 2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డులకు లింక్ చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది.













