క్రికెట్ బెట్టింగ్ లీగల్ చేద్దామా?
బెట్టింగ్ చట్టబద్ధతపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి.. చేయడానికి గల అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి అనేదానిపై అభిప్రాయాలు సేకరిస్తోంది భారత న్యాయ కమిషన్. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు లేఖలు రాసింది. బెట్టింగ్ చట్టబద్ధం చేయడంపై మీ అభిప్రాయాలు, సూచనలు, పరిశీలనలు ఉపయోగపడతాయని లేఖలో పేర్కొన్నారు న్యాయ కమిషన్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సంజయ్ సింగ్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ స్వభావాలను పరిశీలించి వాటికి నిబంధనలు రూపొందించడంలో రాష్ట్ర సంఘాల అభిప్రాయాలు విలువైనవిగా ఉపయోగపడతాయన్నారు. భారత్‌లో ఎక్కువగా క్రికెట్‌పైనే బెట్టింగ్ జరుగుతోంది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం, బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహక బృందం, పోలీసులకు బెట్టింగ్ తలనొప్పిగా మారుతున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో బెట్టింగ్ అనేది లీగల్.. అదే తరహాలో క్రికెట్ లో బెట్టింగ్ ను చట్టబద్ధత చేస్తే ఎలా ఉంటుందో చెప్పాలంటోంది న్యాయ శాఖ.













