విమానాల్లో ల్యాప్టాప్ నిషేధం
విమాన ప్రయాణికులు ఇక నుంచి ల్యాప్టాప్లు వంటి పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకెళ్లరాదని అంతర్జాతీయ విమానయాన సంస్థ సృష్టం చేసింది. అందులోని బ్యాటరీ కాలిపోతే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న భయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత విమానయాన సంస్థ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల బ్యాటరీలు కాలిపోయి పొగ వ్యాపించినట్లు ఫిర్యాదు అందిన వెంటనే ప్రమాదాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైమానికి సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. గత వారం ఢిల్లీ- ఇండోర్ విమానంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి పొగలు రావడంతో వైమానికి సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించగలిగారు.













