ఈ నెల 23న కుమారస్వామి ప్రమాణస్వీకారం
కర్ణాటక ముఖ్యమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఈ నెల 23న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎంతో ఉత్కంఠ, ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. దీంతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాన్నురట. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరవుతారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఆయనను ఆహ్వానించారు అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.













