ఆందోళన అక్కరలేదు: కిరణ్ మజుందార్ షా
పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ లిమిటెడ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. విషమ పరిస్థితుల్లోకి వెళ్లేవారి సంఖ్యను నియంత్రించగలిగినంత వరకు భారత్ కరోనా వైరస్ను కట్టడి చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆమె… అది రోగులపై ఎంత ప్రభావం చూపుతుందన్నదే పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐసీయూలన్ని నిండిపోయేవని…అది జరగనంత కాలం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.













