దేవీప్రియకు కేంద్ర సాహిత్య పురస్కారం
తెలుగు రచయత దేవీ ప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దేవీ ప్రియ రచించిన గాలి రంగు కవితా సంపుటికి పురస్కారం దక్కింది. 2017 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. మొత్తం 24 భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డులను ప్రకటించింది. అమ్మచెట్లు, గరీబుగీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం వంటి పలు ఇతర రచనలు దేవీప్రియ చేశారు. అదేవిధంగా అనువాదం విభాగంలో వీణా వల్లభ రావుకు విరామమెరుగని పయనం, పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పంజాబ్ భాషలోని ఖానాబదోష్ ఆత్మకథను వల్లభరావు తెలుగులోకి అనువందించారు. ఫిబ్రవరిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజేతలకు తామ్రపత్రం, లక్ష నగదును కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానంగా అందజేయనుంది.













