కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభం
కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల అనంతరం కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఛార్థామ్ యాత్ర అధికారికంగా మొదలైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా గత రెండు రోజుల క్రితమే ఓపెన్ చేశారు. ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం కేదార్నాథ్కు చేరుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్ర రూట్లో ప్రత్యేక వసతులను కల్పించారు. ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మళ్లీ ఆలయాన్ని మూసివేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయం దర్శనాలు ప్రారంభం కానున్నాయి.













