గవర్నర్ కోర్టులో కర్ణాటక బంతి!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సృష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇపుడు గవర్నర్ నిర్ణయంపైనే కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు ఆధారపడి ఉంది. అసెంబ్లీలో 224 స్థానాల్లో ఏ ఒక్కపార్టీ కూడా మేజిక్ఫిగర్ను దాటకపోవడంతో ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ముందుగా గవర్నర్ ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసి మెజార్టీ నిరూపించుకోవాలని కోరే అవకాశం ఉంది.
గవర్నర్ వాజుబాయ్ రుడాబాయ్వాలా నిర్ణయమే కీలకంగా ఉంది. సాధారణంగా ఒకే పార్టీకికాని, కొన్ని పార్టీలమద్దతున్న గ్రూప్‌ను కాని పిలిచే అధికారం గవర్నక్‌కు ఉంది. ముందు సంకీర్ణ రాజకీయ పార్టీల కూటమిని పిలిచే అవకాశం ఉంది. ఈ పార్టీలు ఎన్నికలముందే పొత్తులుకుదుర్చుకున్న పార్టీలను సైతం పిలుస్తారు. అలాగే ఏకైక అతిపెద్ద పార్టీని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. లేదా ఇతర పార్టీల మద్దతుతోనూ స్వతంత్ర అభ్యర్థుల మద్దతులోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కోరే అవకాశం ఉంది. ఎన్నికలనంతరం పొత్తులు కూటములుగా ఏర్పడిన పార్టీలనుసైతం ప్రభుత్వం ఏర్పాటు చేసి మద్దతు నిరూపించుకోవాలని కోరవచ్చని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఎన్నికల తర్వాత ఈ పార్టీలు చేతలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతునిస్తే వాటినిసైతం పిలుస్తారు.













