అటార్నీ జనరల్ గా కేకే వేణుగోపాల్
భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది కొట్టాయన్ కటాన్కోట్ వేణుగోపాల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. 1960 నుంచి న్యాయవాది వృత్తిలో ఉన్న వేణుగోపాల్, మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అదనపు సొలిసిటరల్ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంన కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించారు. బాబ్రీ విధ్వంస కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తరపున వాదనలు వినిపించారు. కేరళలో జన్మించిన వేణుగోపాల్ కర్ణాటకలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. దేశంలో న్యాయ సంస్కరణల్లో ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టుల బెంచ్‌ల నియామకాన్ని వ్యతిరేకించిన ఆయన, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యన్నత పురస్కారాలు అందుకున్నారు.













