సుప్రీంకోర్టు సీజేగా గొగొయ్ ప్రమాణస్వీకారం
భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతిభవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ గొగొయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2019 నవంబరు 17న విరమణ పొందే వరకు 13 నెలల పాటు జస్టిస్ గొగాయ్ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అసోంకి చెందిన ఓ జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటివరకు సీజేఐగా కొనసాగిన జస్టిస్ దీపక్ మిశ్ర అక్టోబరు 1న పదవీ విరమణ చేశారు.













