జియో సంచలనం
ప్రారంభంలోనే సంచలనానికి తెరలేపిన రిలయన్స్ జియో మూడేళ్లలో తన అప్రతిహత ప్రస్థానంతో మొదటి స్థానానికి చేరుకుంది. దాదాపు 24 ఏళ్ల క్రితం టెలికం రంగంలోకి ప్రవేశించిన భారత ఎయిర్‌టెల్‌ను, మరో దిగ్గజం వొడాఫోన్ సంస్థను అతి తక్కువ కాలంలో వెనక్కినెట్టి సంచలనాన్ని నమోదు చేసింది. మొత్తం 33 కోట్ల 13 లక్షల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంస్థ జియో జూన్ నాటికి 10,900 కోట్ల రూపాయలు ఆర్జించి ఆదాయంలోనూ తిరుగులేదని నిరూపించింది. ఇదే కాలానికి ఎయిర్టెల్ 10,701.5 కోట్లు, వొడాఫోన్, ఐడియా లు 9,808.92 కోట్లతో తర్వాత స్థానాలకు పడిపోయాయి.













