దేవెగౌడ షరతు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో చేరాలని జెడిఎస్ అధినేత దేవెగౌడ షరతు విధించారు. కర్ణాటకలో బిజెపిని అధికారంలోకి రానివ్వకుండా చూడటమే లక్ష్యంగా జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము బైటినుంచి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు జెడిఎస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. జెడిఎస్ నాయకుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రభుత్వంలో చేరాలని దేవెగౌడ షరతు విధించడంతో కాంగ్రెస్ అందుకు ఒప్పుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి, 20 మంత్రి పదవులు ఇవ్వడానికి వారి మధ్య అంగీకారం కుదిరింది.













