రాజకీయాలకు దీప గుడ్‌బై
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. జయ మరణం తర్వాత ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై పేరుతో 2017 ఫిబ్రవరి 24న దీప కొత్త పార్టీని ప్రారంభించారు. తాజాగా తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప ప్రకటించారు. పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై రాజకీయ విషయాలపై చర్చించేందుకు తన వద్దకు ఎవరూ రాకూడదని పేర్కొన్నారు. తాను మోసపోవడమే రాజకీయ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కొన్ని టీవీ చానళ్లతో ఆమె మాట్లాడుతూ నాకు రాజకీయాల్లో అనుభవం లేదు. నాకు మార్గదర్శకం చేసేందుకు సరైన వ్యక్తులు కూడా లేరు. ఇంతటి బూతు కామెంట్లు వస్తాయని ఊహించ లేదు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే ఇలాంటి బూతు కామెంట్లు పోస్ట్ చేయడం ఆపాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.













