ITC’s B Natural Juices & Beverages unveils their Not From Concentrate Range
ITC Foods తన B NaturalJuices & Beverages కు చెందిన జూసేస్ / రెడీ టు సర్వ్ ఫ్రూట్ బివరేజెస్ పోర్ట్ ఫోలియోను పూర్తిగా “Not from Concentrate” రేంజ్ కు మార్చినట్లు ప్రకటించింది. ఈ మార్పుతో, ఈ బ్రాండ్ తన వినియోగదారులకు Concentrate fruits నుంచి కాకుండా పూర్తిగా పళ్ళ గుజ్జు నుంచి తయారు చేసిన Juices & Beverages మాత్రమే అందజేయనుంది. Not From Concentrate range Juices & Beverages ను వినియోగదారులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా అందించాలన్న లక్ష్యం దీంతో నెరవేరింది.
ఈ విభాగంలో వైవిధ్య భరితమైన ఉత్పత్తులను అందించాలన్న ITC Foods యొక్క విజన్ మరియు నిబధ్ధతకు అనుగుణంగా అది గత సంవత్సరం B Natural 100% Pomegranate Juiceను ప్రవేశపెట్టడం ద్వారాconcentrate free fruit juices సెగ్మెంట్ వైపుకు అడుగులు వేసింది. . Not From Concentrate ఫ్రూట్ జ్యూస్‌లను అందించాలన్న బ్రాండ్ యొక నిశ్చయాన్ని, ఈ ఆవిష్కృతి యొక్క విజయం మరియు కస్టమర్ల ప్రోత్సాహపూర్వక ప్రతిస్పందన బలపరిచింది. గత 3 సంవత్సరాలుగా మార్కెట్లోకి ఈ బ్రాండ్ అనేక ప్రత్యేక ఉత్పత్తులను విడుదల చేసింది. Punjab da Kinnow, Bael & Phalsa వంటి ప్రాంతీయ రుచులను ప్రవేశపెట్టడం ద్వారా B Natural తన పోర్టోఫోలియోను concentrate free juices కు మరల్చాలనే దిశగా పెద్ద అడుగు వేసింది.
B Natural‘Not from Concentrate’ శ్రేణిదిశగా మారడానికి ప్రసిధ్ధి చెందిన ఇ-చౌపల్ నమూనాతో సహా వ్యవసాయ రంగంలో ITCకున్న లోతైననిబధ్ధతే ఆధారం. దాని యొక్క బలమైన మరియు దీర్ఘకాలిక రైతు సంబంధాలు మరియు agricultural value chains ను పెంచి పోసించాలనే కృషి ఈ ప్రత్యేక ఆకాంక్షకు కీలక ప్రేరణలు. ఈ విధానంతో, భారత రైతుల నుండి పళ్ళను సేకరించడాన్ని ప్రోత్సహిస్తూ, తద్వారా భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ఒక శక్తివంతమైన supply chain ను సృష్టించాలని ITC Foods అభిలషిస్తుంది. ఫ్రూట్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులను పెంపొందించి, తద్వారా ఆ రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాలు పెరిగేలా చేయడమే కాకుండా వ్యవసాయ వ్యర్థాల సమస్యను కూడా పరిష్కరించడం Not from Concentrate యొక్క మరొక లక్ష్యం.
ITC Food DivisionsDivisional Chief ExecutiveMr. Hemanth Malik, ఈ సందర్భంగా మాట్లాడుతూ “భారతదేశంలో ప్యాకేజ్డ్ జ్యూస్ లు ప్రారంభించినప్పటి నుండి వాటిని ఆస్వాదించిన తీరుకు కొత్త అర్థాన్ని ఇవ్వడమే B Natural యొక్క ‘Not from Concentrate’ ఉద్దేశం. ఎన్నో సంవత్సరాల తీవ్ర పరిశోధనలు మరియు ప్రయత్నాల నుండి ఆవిర్భవించిన వినూత్నమైన ఆవిష్కరణలను వినియోగదారులకి అందించగలగడం మాకు గర్వకారణం. B NaturalNot from Concentrate శ్రేణి భారతీయ రైతుల నుండి సేకరించిన భారతీయ ఫలాల నుండి తయారు చేసినది. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించే మా బలమైన సంస్థాగత సామర్థ్యం, ఫుడ్స్ బిజినెస్ లో ప్రముఖ ప్రగతిని సాధించడానికి మాకు వీలు కల్పించే విశిష్టమైన పోటీతత్వాన్ని అందిస్తుంది. ITCలో మేము ఎల్లప్పుడూ ప్రపంచంలోనే ఉన్నత నాణ్యతగల ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తాము మరియు B Natural‘Not from Concentrate’ శ్రేణి విషయానికొస్తే, ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన ఒక తాజా మరియు సహజ అనుభవాన్ని అందించగలమని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము.” అన్నారు
ముంబై బాంద్రాలో లోని బ్యాండ్ స్త్రాండ్ లో జరిగిన ఒక ప్రత్యెక కార్యక్రమం లో B Natural’s యొక్క ఈ విసిష్ట ఉత్పత్తుల గురించిన ప్రకటన చేయడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్ Shilpa Shetty ఈ కార్యక్రమం లో పాల్గొని, B NaturalJuicesConcentrate ఫ్రీగా ఉంటాయంటూ కంపనీ అధికార ప్రతినిధితో పాటుగా ప్రతిజ్ఞ చేశారు.
B NaturalJuices & Beverages యొక్క తయారీ మరియు ప్యాకింగ్ బెంగుళూరులోని ఒక అత్యాధునిక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో జరుగుతుంది. Added preservativesఅవసరం లేకుండా, ఫ్రూట్ జ్యూస్ యొక్క తాజాదనం మరియు రుచిని పట్టి ఉంచే ఒక six-layer టెట్రా ప్యాక్ లో దాన్ని ప్యాక్ చేస్తారు.
ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా సూచించే విధంగా ప్యాక్ యొక్క ఎడమ వైపు జత చేసిన ఒక అందమైన ఆకుపచ్చ రిబ్బన్‌తో B NaturalNot from ConcentrateJuices & Beverages ను సులభంగా గుర్తించవచ్చు. B NaturalNot from ConcentrateJuices & Beverages భారతదేశమంతటా అన్ని ఆధునిక ఫార్మాట్లలో మరియు అగ్ర-స్థాయి సాధారణ వాణిజ్య ఔట్లెట్స్ లో లభిస్తాయి. ఇది రూ.99 తో ప్రారంభమయ్యే 1 లీటరు ప్యాక్ మరియు రూ.20 కి లభించే 200 ఎం.ఎల్. ప్యాక్‌లలో లభిస్తుంది.
ITC Foods గురించి:
ITC యొక్క బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపారం, దానికి మార్కెట్లో ఉన్న సుస్థిర స్థానం మరియు దాని ప్రసిధ్ధ బ్రాండ్స్ అయిన – ఆశీర్వాద్, సన్ ఫీస్ట్, బింగో!, యిప్పీ!!, కిచెన్స్ ఆఫ్ ఇండియా, B Natural, మింట్-ఓ, క్యాండీమ్యాన్ మరియు గమ్ఆన్ లకు ఉన్న కస్టమర్ల మద్దతుతో, భారతదేశంలోని అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆహార వ్యాపారాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఫుడ్స్ బిజినెస్ మార్కెట్లోని వివిధ వర్గాలలో తన ఉత్పత్తులను అందిస్తుంది – ఆహార ధాన్యాలు/పప్పు దినుసులు, మసాలాలు, రెడీ-టు-ఈట్, స్నాక్ ఫుడ్స్, బేకరీ &కాన్పెక్షనరీ, జ్యూసెస్ &బివరేజెస్, మరియు ఈ మధ్యే కొత్తగా ఈ జాబితాలోకి చేరిన పాల ఉత్పత్తులు.
ITC యొక్క స్వంత పరిశోధన మరియు అభివృధ్ధి సామర్థ్యాలు, లోతైన కస్టమర్ అవగాహన, భారతీయులకు నచ్చే రుచుల పై ఙ్ఙానం, ఆగ్రి-సోర్సింగ్ మరియు ప్యాకేజింగ్ శక్తులతో పాటు ఒక అసాధారణమైన పంపిణీ వ్యవస్థ ఆధారంగా అభివృధ్ధి చేసిన విస్తృత శ్రేణిలోని వైవిధ్యమైన, వాల్యూ-ఆడెడ్ ఉత్పత్తులతో లక్షలాది కుటుంబాలకు ITC Food Brands ఆనందాన్ని పంచుతున్నాయి.
తన వినియోగదారులకు ఆరోగ్యం మరియు భద్రతను అందించే రాజీలేని నిబధ్ధతతో, తయారీ ప్రక్రియలు మరియు సప్లై చైన్‌లో అత్యున్నత స్థాయిలో నాణ్యత, భద్రత మరియు పరిశుభ్రత అనే విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేలా ITC నిర్ధారించుకుంటుంది. ITC యొక్క స్వంత తయారీ పరిశ్రమలన్నింటికీ హజార్డ్ అనాలసిస్ ఆండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ (హెచ్.ఎ.సి.సి.పి.) సర్టిఫికేషన్ ఉంది. అన్ని తయారీ పరిశ్రమల యొక్క పనితీరులో నాణ్యతను నిరంతరం ఆన్ లైన్లో పర్యవేక్షిస్తారు. ప్రాసెస్ కంట్రోల్‌ను మించి, తన ఆహార ఉత్పత్తులను తయారు చేసే దినుసులను ఎంచుకోవడంలో కూడా ITC ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తుంది.
దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ సరఫరాదారుగా నిలవాలనే దాని ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి, ఉద్భవిస్తున్న అవకాశాలను ఉపయోగించుకునే విధంగా ఈ వ్యాపారం తయారీ, సరఫరా మరియు మార్కెటింగ్‌లోని ప్రతి అంశంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తుంది. ITC Foods తన ఉత్పత్తులను ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా వంటి ముఖ్య ప్రదేశాలకు ఎగుమతి చేస్తుంది.
మరిన్ని మీడియా క్వెరీల కొరకు దయచేసి సంప్రదించండి –
షర్మిష్ఠా గోస్వామి| sharmistha.goswami@madisonpr.in | +91 9916854567
రితికా సింగ్| ritika.singh@madisonpr.in | +91 9620072175













