మోడీ రక్షణకు ఇజ్రాయిల్ జాగిలాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రతపై మరింత దృష్టి పెట్టారు అధికారులు. దీనికోసం ఇజ్రాయిల్ నుంచి ప్రత్యేకంగా స్నిపర్ డాగ్స్ ను రప్పిస్తున్నారు. వీటికి ప్రపంచంలోనే గొప్ప పేరుంది. పేలుడు పదార్థాలు, బాంబులను సమర్థవంతంగా కనిపెట్టడంతో పాటు నేరస్థులను పట్టుకోవడంలోనూ స్నిఫ్ అండ్ అటాక్ డాగ్స్ కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల భద్రతకు ఇపుడు వీటిని వినియోగిస్తున్నారు. 2016లో 30 అటాక్ డాగ్స్, బాంబు స్నిఫర్ డాగ్స్, చేజర్స్ లను జెరుసలామ్ నుంచి తెప్పించినట్లు సమాచారం. తాజాగా ఇజ్రాయిల్ రక్షణ రంగంలో మేటిగా నిలిచిన కానైన్లు – లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులను దిగుమతి చేసుకున్నారు. అయితే ధర మాత్రం తెలియడం లేదు.
ప్రత్యేక శిక్షణ:
ఈ డాగ్స్ కి దాదాపు 6నెలలపాటు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కాలంలో కుక్కలకు ప్రత్యేకమైన ఆహారం, నివాస వాతావరణం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. తరచూ వైద్యలు చేత పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారని భద్రతా అధికారి తెలిపారు. భారత మాజీ ప్రధానుల కుటుంబాలకు సైతం ఈ భద్రత వర్తిస్తుంది.













