అంబానీ ఇంట పెళ్లి సందడి
బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని కుమార్తె ఇషా అంబాని తన దీర్ఘకాలిక మిత్రుడు ఆనంద్ పిరమల్‌ను వివాహమాడబోతున్నారు. వారి వివాహం డిసెంబరులో ఉంటుందని కుటుంబసన్నిహితులు సృష్టం చేశారు. పిరమ్గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో చిరకాలంగా ఇషా అంబాని మైత్రీబంధం కొనసాగుతోంది. నాలుగుదశాబ్దాలుగా వీరి తల్లిదండ్రులకు సైతం మంచి స్నేహం ఉంది. పిరమ్ రియాల్టీ వ్యవస్థాపకునిగా ఆనంద్పరిమల్కు మంచిపేరుంది. పిరమల్ స్వాస్థ్య గ్రామీణ హెల్త్‌కేర్ కార్యాచరణను సైతం ఆనంద్ కొనసాగిస్తున్నారు. పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆనంద ఉన్నారు. ఈయువ పారిశ్రామికవేత్త ఇండియన్ మర్చంట్ ఛాంబర్ యూత్వింగ్ అధ్యక్షునిగా సైతం పనిచేసారు. ఇషా అంబాని కూడా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. మహాబలేశ్వర్‌లోని ఒక దేవాలయంలో ఆనంద్ ఇషాకు వివాహం చేసుకోవాలని ప్రపోజ్ చేసినట్లు సమాచారం.













