అంగరంగవైభవంగా ఇషా అంబానీ నిశ్చితార్థం
మనదేశంలోనే అత్యధిక ధనవంతుడు ముకేష్అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ నిశ్చితార్థం ఉత్తర ఇటలీలోని కోమె సరసస్సులో నులపండువగా జరిగింది. చిరాకాల స్నేహితుడు ఆనంద్ పిరామల్, ఇషా పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. మేలిమి వస్త్రాల్లో మెరిసిపోతున్న కుమార్తెను ముకేష్ అంబానీ చేయి పట్టుకుని సరస్సు వద్దకు తోడ్కొని వచ్చారు. అంబానీ, పిరామల్ కుటుంబసభ్యులు, సన్నిహితుల కరతాళధ్వనుల మధ్య వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. బాలీవుడ్ నటీనటులు షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, కరణ్‌జోహర్, అలియాభట్, అనిల్‌కపూర్, సోనంకపూర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుడు ఆనంద్ పిరామల్ గ్రూప్ కంపెనీల చైర్మన్ అజయ్ పిరామల్ కుమారుడు.













