ఇషా, ఆనంద్ నిశ్చితార్థం!
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, మరో బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థం నేడు ఇటలీలోని లేక్ కోమోలో జరుగనున్నట్లు తెలుస్తున్నది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులతోపాటు ముకేశ్ అంబానీకి చెందిన దగ్గరి బంధువులు హాజరుకానున్నారు. మహారాష్ట్రలోని మహబలేశ్వర్ దేవాయలంలో ఇషాకు ఆనంద్ తొలిసారిగా తన ప్రేమను తెలియచేశారు. ఆ తర్వాత మేలో ఇరు కుటుంభ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఒక కార్యక్రమం జరిగింది. డిసెంబర్లో వీరిద్దరి వివాహాం జరుగనున్నట్లు తెలుస్తున్నది.













