నిరాడంబరంగా ఉక్కు మహిళ వివాహం
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిళ తమిళనాడులోని కొడైకెనాల్లో వివాహం చేసుకున్నారు. బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్తో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆమె పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం జరిగిన ఈ వివాహానికి ఇరువురి తరపున బంధువులు ఎవరూ హాజరుకాలేదు. షర్మిళ మొబైల్ ఫోనులోనే తన తల్లిదండ్రులను సంప్రదించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రశాంతత కోసం తాను అనేక ప్రాంతాలు వెతికానని, కొడైకెనాల్లో తన అన్వేషణ ముగిసిందన్నారు. స్థానికంగా కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల హక్కుల కోసం పోరాడతానని సృష్టం చేశారు.













