నేటి నుంచి ఈ-వే బిల్లులు
కేంద్ర ప్రభుత్వ ఆర్థికమంత్రిత్వశాఖ చేపట్టిన ప్రక్షాళణ దిశలో భాగంగా ఆదివారం అర్థరాత్రి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఈ-వే బిల్లును ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రాల సరిహద్దులోని చెక్‌పోస్టులు చేసే పనులు ఇకపై సరుకు రవా ణ చేసే సంస్థలు ఆన్లైన్లోనే ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. సరుకు కొను గోలుదారుడు నుండి రవాణాసంస్థలు ఈ వేబిల్లుకు అయ్యే ఖర్చులు వసూలు చేస్తా రు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వం వాణిజ్యపన్నులశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టులను ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే.













