9న ఢిల్లీలో అమరావతిపై అంతర్జాతీయ మీడియా సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక మైలురాళ్లు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలిపేందుకు ఈ నెల 9న ఢిల్లీలో అంతర్జాతీయ మీడియా సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) వెల్లడించింది. 2036 నాటికి అమరావతి మీడియా నగరంలో ప్రత్యక్షంగా 60,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలిపింది. సినిమా, టీవీ, యానిమేషన్/ వీఎఫ్ఎక్స్/ గేమింగ్, డిజిటల్ యాడ్-సామాజిక మాధ్యమాలు, టెలికాం రంగాలు ఈ మీడియా నగరానికి నాలుగు స్తంభాలుగా ఉంటాయని వివరించింది.













