కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్
2019-20 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్ను ఇన్చార్జ్ ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పీయూష్ తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉండటంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను రూ. 2,84,200 కోట్లుకు అంచనా వేశారు.
బడ్జెట్లో ప్రధానాంశాలు :
– పెన్షన్లు : 1,74,300 కోట్లు
– రక్షణ రంగం : 3,05,296 కోట్లు
– ప్రధాన సబ్సిడీల కోసం : 2,96,684 కోట్లు
– వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలు : 1,49,981 కోట్లు
– వాణిజ్యం మరియు పరిశ్రమలు : 27,660 కోట్లు
– ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి కోసం : 3,000 కోట్లు
– విద్య : 93,848 కోట్లు
– ఇంధన రంగానికి : 44,101 కోట్లు
– విదేశీ వ్యవహారాల శాఖ : 16,062 కోట్లు
– ఆర్థిక శాఖకు : 19,812 కోట్లు
– ఆరోగ్య రంగానికి : 63,538 కోట్లు
– హోంశాఖ : 1,03,927 కోట్లు
– ఇంటరెస్ట్ : 6,65,061 కోట్లు
– ఐటీ మరియు టెలికాం : 21,549 కోట్లు
– ప్లానింగ్ మరియు స్టాటస్టిక్స్ : 5,594 కోట్లు
– గ్రామీణాభివృద్ధికి : 1,38,962 కోట్లు
– సాంకేతిక శాఖ : 26,237 కోట్లు
– సాంఘిక సంక్షేమ శాఖ : 49,337 కోట్లు
– ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ : 1,17,285 కోట్లు
– రాష్ర్టాల బదిలీలకు : 1,66,883 కోట్లు
– రవాణా వ్యవస్థ : 1,56,187 కోట్లు
– కేంద్ర పాలిత ప్రాంతాలు : 15,042 కోట్లు
– పట్టణాభివృద్ధికి : 48,032 కోట్లు
– ఇతర రంగాలకు : 75,822 కోట్లు













