తిరుపతి టూ బెంగళూర్‌కు ఇండిగో సర్వీసులు
తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూర్ నగరాలకు అధునాతన బ్రాండ్ న్యూ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. జనవరి ఏడవతేదీన తిరుపతిలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తిరుపతి- హైదరాబాద్ మధ్య మూడు, తిరుపతి- బెంగళూర్ మధ్య రోజూ రెండు విమానాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ విస్తరణలో భాగంగా ఈ ఏడాది మరో 50 సర్వీసులను ప్రారంభించనున్నామనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి నగరాలకు ఎక్కువ సంఖ్యలో విమానాల సర్వీసులను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కనీస చార్జి కింద రూ.1499 లు నిర్ణయించినట్లు తెలిపారు.













