రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. మధురపూడి విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప రాజమహేంద్రవరం నుంచి చెన్నై సర్వీసును ప్రారంభించారు. రాజమహేంద్రవరం నుంచి ఇప్పటి వరకూ నాలుగు విమాన సర్వీసులు నడుస్తుండగా ఇండిగోతో ఈ సంఖ్య ఎనిమిదికి చేరిందని చిన రాజప్ప తెలిపారు. త్వరలో ఈ సంఖ్య 16 చేరుతుందన్నారు. స్థానిక పట్టణాలు, నగరాలకు కూడా విమానయానం అందుబాటులో ఉండాలనే ముఖ్యమంత్రి ఆలోచనతో రాష్ట్రంలో విమాన సర్వీసులు పెరుగుతున్నాయన్నారు.













