రూ.999కే ఇండిగో టికెట్
రద్దీ తక్కువగా ఉండే వర్షాకాలంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీ విమాన యాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో రూ.999కే టికెట్ అందిస్తోంది. జూలై 4న ప్రారంభమైన ఈ ఆఫర్ జూలై 8 దాకా ఉంటుంది. దీని కింద అందించే టికెట్లు సెప్టెంబర్ 27 దాకా చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తమ వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్లో చెన్నై-బెంగళూరు రూట్లో టికెట్ రేటు రూ. 999గా ఉండగా, అహ్మదాబాద్ నుంచి ముంబైకి రూ.1,349గా ఉంది. మరోవైపు పేటీఎం ద్వారా చేసే టికెట్లు కొనుగోలు చేస్తే 10 శాతం మేర (రూ.500 దాకా) అదనంగా డిస్కౌంటు కూడా ఇస్తోంది. దేశీ రూట్లలో నాన్ స్టాప్ ప్లయిట్స్కి మాత్రం ఇది వర్తిస్తుంది. గ్రూప్ బుకింగ్స్‌కి వర్తించదు.













