ఇండిగో న్యూ ఇయర్ సేల్ ఆఫర్
ఇండిగో న్యూ ఇయర్ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.899 ప్రారంభ ధరతో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ జనవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కస్టమార్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను, రూ.600 వరకు విలువైన ఇండిగో స్పెషల్ సర్వీస్ వోచర్లను పొందొచ్చు. అయితే వీటికి షరతులు వర్తిసాయి. ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఫ్లైట్స్‌కు, పరిమిత సంఖ్యలోని సీట్లకు మాత్రమే వరిస్తుంది.













