దీపావళి ఆఫర్…రూ.899కే విమాన టికెట్
దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో అత్యంత తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రారంభ ధర రూ.899 టికెట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మూడు రోజుల పాటు అందించే ఈ ఆఫర్ కింద 10 లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అక్టోబర్ 24 నుంచి అక్టోబరు 26 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రారంభ ధర రూ.899కే టికెట్. నవంబరు 8, 2018, ఏప్రిల్ 15, 2019 వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణాలు చేయొచ్చు అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.













