రూ.1,212 కే విమాన ప్రయాణం
దేశంలో తక్కువ ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఒకటి. ఈ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12 లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25 నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను నేటి నుంచి జులై 13వ తేదీ వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో బుకింగ్ చేసుకునేవారు క్యాష్‌బాక్ కూడా పొందవచ్చని ప్రకటించింది. దీనికి కనీసం రూ.3000తో బుకింగ్ చేసుకోవాలని ప్రకటించింది.













