ఇండిగో వార్షికోత్సవ ఆఫర్ అదిరింది!
దేశంలో ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1111 ప్రారంభ ధరతో టిక్కెట్లను విక్రయిస్తామంటూ అదిరిపోయే ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఆ సంస్థ 11వ వార్షికోత్సవంలో భాగంగా అన్ని ట్యాక్స్‌లతో కలిపి టిక్కెట్లను విక్రయించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్లో ఈ రోజు నుంచి ఆగస్టు 6 వరకు టికెట్ల బుకింగ్ అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఆగస్టు 21 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో మొత్తం 45 ప్రాంతాలకు ఈ ఆఫర్‌ను వర్తింపజేసింది. మొబివికీ వ్యాలెట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్నట్టయితే మరో 11 శాతం ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది.
ఏయే ప్రాంతాలకు బుక్‌చేసుకోవచ్చు..
ఈ ఆఫర్ కింద ప్రయాణికులు అగర్తలా, అహ్మదాబాద్, అమృత్సర్, బ్యాంకాక్, బెంగళూరు, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్, దిల్లీ, డిబ్రుఘడ్, దోహా, దుబాయ్, గోవా, గువాహటి, హైదరాబాద్, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కతా, కోజికోడ్, లఖ్‌నవూ, మధురై, మంగుళూరు, ముంబయి, మస్కట్, నాగపూర్, పట్నా, పోర్ట్‌బ్లెయిర్, పుణె, రాయిపూర్, రాంచీ, షార్జా, సింగపూర్, శ్రీనగర్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్, వడోదర, వారణాసి, విశాఖపట్నంలు సహా మరికొన్ని ప్రాంతాలకు టిక్కెట్లు బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
అయితే, ఈ ఆఫర్‌కి కొన్ని నిబంధనల్ని విధించింది. పైన పేర్కొన్న ప్రాంతాలకు నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అన్ని బుకింగ్ ఛానెళ్లలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంచుతున్నట్టు సదరు సంస్థ ప్రకటించింది.













