మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
ఎయిర్ లైన్స్ ఇండిగో మాన్సూన్ ఆఫర్ను ప్రకటించింది. వన్ వే విమానాల్లో దాదాపు రూ.745 టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ పథకం పరిమిత కాలం అమల్లో ఉండనుంది. జులై 4 లోపు ప్రస్తుత డిస్కౌరట్ ధరల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జూలై 14, 2017 నుంచి మార్చి 24, 2018ల మధ్య ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఇండిగో వెబ్ సైట్ సమాచారం ప్రకారం అన్ని కలుపుకొని విమానా టికెట్లు జమ్ము-శ్రీనగర్ మార్గంలో రూ.745 అగర్తల- గైహతి రూ.778, చెన్నై-బెంగళూరు రూ.898, అహ్మదాబాద్-ముంబై రూ.1,048, బెంగళూరు-చెన్నై రూ.1,059, బెంగళూరు-కొచి రూ.1,199 బాగ్దోగ్రా-కోలకతా రూ.1,199 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. అహ్మదాబాద్, అమృత్సర్, బాగ్దోగ్రా, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కొచీ, కోలకతా, మధురై, మంగళూరు, ముంబై నుండి కాని స్టాప్ విమానాలకు చెల్లదు. పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, శ్రీనగర్, తిరువనంతపురం, వారణాసి, విశాఖపట్నం నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.













