శీతాకాల ఆఫర్ ప్రకటించిన ఇండిగో
చౌక విమానయాన సంస్థ ఇండిగో శీతాకాలం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.899గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 15లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్లో తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి విలియమ్ బౌల్టర్ తెలిపారు. ఈ ఆఫర్ కోసం సంస్థ 10 లక్షల సీట్లను కేటాయించింది.













