హోలీ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
హోలీ పండుగ సందర్భంగా దేశీ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. స్పెషల్ హోలీ సేల్ పేరిట అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ ఏడాది మార్చి 19 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రయాణాలకు.. మార్చి 5 నుంచి మార్చి 7 లోపు బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రత్యేక ఆఫర్లలో భాగంగా దేశీ ప్రయాణాలపై ప్రారంభ టికెట్ ధర రూ.899గా ప్రకటించింది. విదేశీ రూట్లలో ప్రారంభ ధర రూ.3,399. ఢిల్లీ-అహ్మదాబాద్ రూ.2,100, ఢిల్లీ-కోల్కతా రూ.2,899, ఢిల్లీ-ముంబై మార్గాల్లో రూ.2,399గా టికెట్ ధరలు ఉన్నట్లు సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ తెలిపారు.













