బెంగళూరు-రాజమహేంద్రవరం- విశాఖ విమాన సర్వీసు
రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం, బెంగళూరులకు విమానయాన సేవలు చేరువ కానున్నాయి. సెప్టెంబరు 15 నుంచి ఆయా ప్రాంతాల మధ్య సర్వీసు నడిపేందుకు ఇండిగో విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3:50 గంటలకు బెంగళూరులో బయలుదేరే విమానం సాయంత్రం 5:25కు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. 5:45 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి 6:30కు విశాఖపట్నం చేరుతుంది. అక్కడ నుంచి 6:50 గంటలకు బయలుదేరి రాత్రి 7:40కు రాజమహేంద్రవరం చేరుకుని..రాత్రి 8 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి 10 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. పరిశీలనలో భాగంగా ఈ సర్వీసును అక్టోబరు 17 వరకు వారానికి మూడు రోజులు మాత్రమే నడపనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.













