గన్నవరానికి ఇండిగో సర్వీసులు
వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఎటిఆర్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రాంతీయ విమానయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రకటించిన ఉడాన్ పథకం కింద కంపెనీ ఈ విమాన సర్వీసులు ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ఇండిగో ఇప్పటికే హైదరాబాద్-మంగళూరు మధ్య ఎటిఆర్ విమాన సర్వీసులు నడుపుతోంది. మార్చి 2 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఎటిఆర్ విమానాల ద్వారా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. జనవరి నుంచి రాజమండ్రి, తిరుపతి నుంచి ఎటిఆర్ సర్వీసులు ప్రారంభించబోతోంది.













