ప్రవాస భారతీయులు దేశానికి శాశ్వత ప్రచారకర్తలు
ప్రవాస భారతీయులు దేవానికి శాశ్వత ప్రచారకర్తలని, వివిధ దేశాలతో భారత్ బంధాలను బలోపేతం చేసేది వారేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెన్యాలోని నైరోబీలో జరిగిన కచ్ఛీ లెవా పటేల్ సమాజ్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ మేరకు ప్రసంగించారు. తూర్పు ఆఫ్రికా దేశాల్లోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో గుజరాత్‌కు చెందిన కచ్ఛీ సామాజిక వర్గ ప్రజలు పోషిస్తున్న పాత్రను మోదీ కొనియాడారు. కెన్యా స్వాతంత్య్ర ఉద్యమంలోనూ వారు పాలుపుంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2001లో గుజరాత్లో భూకంపం అనంతరం, పునరావాస, పునిర్నిర్మాణ పనుల్లో నూ కచ్ఛీ వర్గం సాయపడిందని మోదీ అన్నారు.













