భారతీయులు క్షేమం
మాంచెస్టర్‌లో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో భారతీయులెవరూ మృతిచెందలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. భారతీయులు మృతిచెందినట్లుగానీ, గాయపడినట్లుగానీ ఇప్పటివరకు ఎలాంటి నివేదికలూ అందలేదు. పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం అంటూ సుష్మ ట్వీట్ చేశారు. అక్కడి పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం అని అన్నారు. ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే మాంచెస్టర్ దాడిలో ఎవరైన భారతీయులు గాయపడితే వీలైనంత త్వరగా 020 7632 3035 నంబరు ద్వారా హెచ్‌సీఐ (హై కమిషన్ ఆఫ్ ఇండియా) లోని పబ్లిక్ రెస్పాన్స్ యూనిట్‌ను సంప్రదించాలి. అని లండన్‌లోని భారత హై కమిషన్ ట్వీట్ చేసింది.













