6,690 వజ్రాలతో గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉంగరం
వజ్రాల రాజధానిగా పేరొందిన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల తయారీదారులు తమ కళాకృతితో ప్రపంచ రికార్డు సాధించారు. 6,600లకు పైగా వజ్రాలు పొదిగిన చేతి ఉంగరంతో సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. సూరత్‌కు చెందిన విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్ ఈ ఉంగరాన్ని రూపొందించారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తామరపువ్వు ఆకారంలో చేసిన ఈ ఉంగరం తయారీకి 6,690 వజ్రాలను వినియోగించారు. ఉంగరంపై ఉన్న 48 తామర రేకులతో వజ్రాలతో చేశారు. గిన్నిస్ రికార్డు ప్రకారం దీని ధర దాదాపు రూ.28కోట్లు ఉంటుందట. 58 గ్రామలు బరువున్న ఈ ఉంగరాన్ని తయారుచేసేందుకు ఆరు నెలలు పట్టిందట.













