2 ప్లస్ 2లో చర్చించాలి
అమెరికా హెచ్-1బీ వీసాపై విధిస్తున్న నియమ నిబంధనలు, ఎదురవుతున్న సమస్యల గురించి సెప్టెంబర్‌లో నిర్వహించే 2 ప్లస్ 2 సమావేశంలో లేవనెత్తాలని సభ్యులు డిమాండ్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో ఎదురవుతున్న సమస్యలపై భారత్ గట్టిగా ప్రశ్నించాలని కోరారు. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా భారతీయుల వీసాలు తగ్గించబడలేదని, ఎలాంటి మార్పులు ఇంకా అమల్లోకి రాలేదని వివరించారు. ఈ సమస్య అనేది కేవలం ప్రభుత్వం, ప్రతిపక్షానిది మాత్రమే కాదని, మొత్తం సభ, దేశానిది అని ఆమె చెప్పారు. భారతీయులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూస్తుందని, వైట్‌హౌస్ వర్గాలకు తెలియాజేస్తామని, ఇప్పటకే అధికారిక సమావేశాల్లో దీనిపై చర్చించామని సుష్మా తెలిపారు.













