ప్రధానికి దారివ్వండి .. పాక్‌ను కోరిన భారత్
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కోసం పాకిస్థాన్ గగనతలాన్ని వినియోగించేందుకు అనుమతించాలంటూ ఆ దేశాన్ని భారత్ కోరినట్లు సమాచారం. ఈ నెల 22న ప్రధాని అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అయితే భారత్ చేసిన సాధారణ విజ్ఞప్తిపై పాకిస్థాన్ ఇంకా స్పందించలేదు. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ మీదుగా ఐస్లాండ్ వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోదీ పర్యటన కోసం పాక్ మార్గంలో అనుమతి కోరడం గమనార్హం.













