విదేశీ పర్యాటకులకు శుభవార్త
విదేశీ పర్యాటకుల వీసా నిబంధనలను కేంద్రం సడలించింది. ప్రస్తుతం విదేశీయులకు బిజినెస్ వీసాపై ఉన్న గడువును ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ పెంచనుంది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ నివసిస్తున్న వారికి వచ్చిన సాధారణ వీసాను మెడికల్ వీసా కింద మార్చేందుకు అవకాశం కల్పించింది. ఇక ఇంటర్న్షిప్ వీసా మంజూరులోనూ పలు సడలింపులు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ విషయాలను వెల్లడించారు. పర్యాటకం, బిజినెస్, ఆరోగ్యం, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం భారత్కు వచ్చే విదేశీయులకు కేవలం 72 గంటల్లోనే ఆన్లైన్లో వీసా మంజూరు చేస్తున్నామన్నారు.













