జూలై 1 నుంచి ఈ వస్తువుల ధరలన్నీ చౌక!
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. బియ్యం, గోధమలు తదితర 7 శాతం వస్తువులకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు వీటిపై వ్యాట్ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి పన్ను బాధ ఉండదు. కాబట్టి వీటి ధరలు తగ్గునున్నాయి. చిరుధాన్యాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నందున వీటి ధరలపై తరువాత నిర్ణయం తీసుకుంటారు. సబ్బులు, టూత్ పేస్టులు, హెయిర్ ఆయిల్, వంటనూనెలు, పంచదార, పెయింట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. చిన్నకార్లు, తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉంది. మిఠాయిలు 5 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి మీద అంతకంటే ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నారు కాబట్టి వాటి ధరలు కొంత తగ్గుతాయి. హెయిర్ ఆయిల్స్, సబ్బులు, టూత్‌పేస్ట్‌లపై ప్రస్తుతం మనం 22-24 శాతం మధ్యలో పన్ను కడుతున్నాం. వీటి 18 శాతం శ్లాబ్‌లో ఉంచారు కాబట్టి ఈ వస్తువులు జులై 1 నుంచి ధరలు తగ్గుతాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మీద ప్రస్తుతం 31 నుంచి 32 శాతం పన్నులు చెల్లిస్తున్నాం. కొత్త పన్నుల విధానంలో ఇవి 28 శాతం శ్లాబ్‌లో ఉన్నాయి కాబట్టి వీటి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.













