సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
కరోనా వైరస్ రోజురోజుకీ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదని తెలిపింది. అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. న్యాయవాదులకు కొన్ని లింక్ లు ఇస్తామని, వాటిని డౌన్లోడ్ చేసు వీడియో కాల్ కనెక్ట్ చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బోబ్డే వివరించారు. అప్పటి వరకు కోర్టు భవనంలోని లాయర్ల ఛాంబర్లన్నీ మూసివేయాలని సిబ్బందిని ఆదేశించింది. లాయర్ల ఎలక్ట్రానిక్ పాస్‌లను కూడా రద్దు కూడా చేశారు. నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి కోర్టులోని లాయర్ల ఛాంబర్లన్నింటినీ మూసివేయనున్నారు.













