ఇకపై ఏప్రిల్ నుంచి మార్చి కాదు… జనవరి నుంచి డిసెంబరు!?
ఆర్థిక సంవత్సరం ప్రారంభం, ముగింపులను మార్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఇంత వరకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, తర్వాత వచ్చే మార్చి 31తో ముగిసేది. దీనిని జనవరి 1తో ప్రారంభమై డిసెంబరు 31తో ముగిసేవిధంగా చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు శుక్రవారం చెప్పారు. లోక్సభకు ఆయన లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారో ఆయన వివరించలేదు.













