పాక్ శిశువుకు భారత్ వీసా
పాకిస్థాన్‌కు చెందిన రెండున్నర నెలల మగ శిశువుకు భారత వైద్యపరమైన వీసాను జారీ చేసింది. ఆ శిశువుకు హృద్రోగం ఉంది. చికిత్సలో జోక్యానికి మగ బిడ్డ తండ్రి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యాన్ని కోరారు. ఆయన ట్విట్టర్ సందేశానికి సుష్మా సానుకూలంగా స్పందించారు. తన కుమారుడికి వైద్య వీసా కోసం ఈ వారం మొదట్లో పాక్ జాతీయుడైన కెన్ సిడ్ సుష్మాను ట్వీట్లో కోరాడు. పాకిస్థాన్‌లో తన బిడ్డ వైద్యానికి అవకాశం లేదని విన్నవించుకొన్నాడు. పాక్‌లోని ఇండియన్ హై కమిషన్‌ను సంప్రదించండని సుష్మా సలహా ఇచ్చారు. బిడ్డ చికిత్సకు హామీ ఇచ్చారు.













