హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ తో మాట్లాడతాం : సుష్మా
అమెరికాతో హెచ్1బీ వీసా హోల్డర్ల భాగస్వాములను పనిచేయడానికి అనుమతి ఇచ్చే నిబంధనను రద్దు చేయాలనుకుంటున్న ట్రంప్ ప్రభుత్వంతో మాట్లాడతామని సుష్మాస్వారాజ్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ట్రంప్‌ను ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రిటన్‌లో భారతీయ జైళ్ల పరిస్థితులపై ప్రధాని మోదీ, ఆ దేశ ప్రధాని థెరిసా మేతో అసంతృప్తి వ్యక్తం చేశారని సుష్మ తెలిపారు. విజయ్ మాల్యాను దేశానికి అప్పగించే విషయమై జరిగిన విచారణలో మోదీ ఈ మేరకు తెలిపారని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇరాన్, వెనిజూలపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, ఆ దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఐరాస ఆంక్షలను మాత్రమే పరిగణిస్తామని తెలిపారు.













