ప్రధాని మోదీ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తరుణంలో చైనాలో వూహాన్ నుంచి పాకిస్థాన్ జాతీయులను ఇస్లామాబాద్‌కు తరలించేందుకు సిద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగుదేశం ప్రథమం అనే విధానం మేరకు పాకిస్థాన్‌కు సహకరించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. వూహాన్‌లోని భారతీయులతో పాటు పొరుగుదేశాలకు చెందిన అందరినీ తీసుకువస్తామన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోగలిగే శక్తి తమకు లేదని పాక్ విద్యార్థుంతా వూహాన్‌లోనే ఉండిపోవాలని సూచించింది. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న పాక్ విద్యార్థులను రక్షించేందుకు భారత్ ముందుకు రావడంపై ప్రశంసులు వెల్లువెత్తుతున్నాయి.













