పాక్కు ఉపరాష్ట్రపతి పరోక్ష హెచ్చరిక
ఎంతగా కవ్వింపు ధోరణులు కనిపిస్తున్నా భారత్ సంయమనం పాటిస్తోందని, ఒకవేళ దాడి జరిగితే మరచిపోలేని జవాబు ఇస్తుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. పాకిస్థాన్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా ఆ దేశాన్ని ఉద్దేశించి ఈ హెచ్చరిక చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగాల్లో ఎంపిక చేసిన 95 ఉపన్యాసాలను సంకలనం చేసి ప్రచురించిన ద రిపబ్లికన్ ఎథిక్, లోక్తంత్ర కేస్వర్ పుస్తకాల రెండో సంపుటిలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ భారత్ ఎన్నడూ దురాక్రమణలకు పాల్పడలేదని, శాంతియుత సహజీవనానికే కట్టుబడి ఉందని అన్నారు.













